👑 మిస్ వరల్డ్-2026గా డొమినికన్ రిపబ్లిక్ సుందరి!
👑 మిస్ వరల్డ్-2026గా డొమినికన్ రిపబ్లిక్ సుందరి!
వియత్నాం వేదికగా అట్టహాసంగా నిర్వహించిన 73వ మిస్ వరల్డ్-2026 పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరి మోలా డొమింగ్వెజ్ విశ్వవిజేతగా నిలిచారు. ప్రతిష్ఠాత్మక కిరీటాన్ని కైవసం చేసుకుని ప్రపంచ సుందరిగా అవతరించారు.
ఈ పోటీల్లో స్పెయిన్‌కు చెందిన ఎలిజబెత్ రెయిన్స్ ప్రథమ రన్నరప్‌గా, మలేసియాకు చెందిన తనూసియా చెట్టి ద్వితీయ రన్నరప్‌గా నిలిచారు.
ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న జోహెరి మోలా డొమింగ్వెజ్ వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు, సామాజిక కార్యకర్తగా సేవలందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా పేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు ఉచితంగా ఆంగ్ల భాషను బోధిస్తూ సామాజిక సేవలో భాగస్వామ్యమవుతున్నారు.
ఇక భారత్ తరఫున పోటీల్లో పాల్గొన్న మిస్ ఇండియా వరల్డ్-2024 నికిత పొర్వాల్ టాప్-40లో చోటు సంపాదించారు. అయితే టాప్-20లోకి మాత్రం ప్రవేశించలేకపోయారు.
డొమినికన్ రిపబ్లిక్ సుందరి జోహెరి మోలా డొమింగ్వెజ్ మిస్ వరల్డ్-2026 కిరీటం గెలుచుకోవడం విశేషంగా నిలిచింది.

Post a Comment