ఉపాధ్యాయులు, అధికారులతో జమాత్-ఎ-ఇస్లామీ హింద్ మహిళా విభాగం గెట్ టుగెదర్
ఉపాధ్యాయులు, అధికారులతో జమాత్-ఎ-ఇస్లామీ హింద్ మహిళా విభాగం గెట్ టుగెదర్
కొత్తగూడెం: ఉపాధ్యాయులు, అధికారులు, మహిళా ప్రతినిధుల మధ్య పరస్పర పరిచయాలు, సానుకూల ఆలోచనల మార్పిడి, విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై చర్చించే ఉద్దేశంతో జమాత్-ఎ-ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో గెట్ టుగెదర్ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా దిశ ఉమేన్ ప్రొటెక్షన్ చైర్ పర్సన్ వాసర్ల నాగమణి పాల్గొన్నారు.
కొత్తగూడెం దక్షిణ ప్రాంతంలోని జమాత్-ఎ-ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9వ తేదీ బుధవారం సాయంత్రం 7 గంటల కొత్తగూడెంలోని పోస్టాఫీస్ ప్రాంతంలో ఉన్న జమాత్ కార్యాలయం వేదికగా కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, అధికారులు, మహిళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర, విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో వారి బాధ్యత, విద్యా రంగంలో ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై ఈ సమావేశంలో అభిప్రాయాలను పంచుకున్నారు.
‘నిజాయితీగా పనిచేసే ఉపాధ్యాయుడు పాఠం ముగిసిన తర్వాత కూడా కొనసాగుతూ పెరుగుతున్న జ్ఞాన విత్తనాలను నాటుతాడు’ అనే సందేశాన్ని కార్యక్రమానికి ప్రధాన ఆలోచనగా తీసుకున్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, వారి ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్ది, జీవితంలో ముందుకు సాగేందుకు అవసరమైన విలువలను అందిస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు, అధికారుల మధ్య సమన్వయం పెంపొందించడంతో పాటు సమాజంలో విద్య, మహిళా సాధికారత, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ గెట్ టుగెదర్‌లో పాల్గొనే వారంతా తమ అనుభవాలను, సూచనలను పరస్పరం పంచుకోవడంతో పాటు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలపై చర్చించారు. భవిష్యత్‌లో విద్యా, సామాజిక రంగాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా అభిప్రాయ సేకరణ జరిగే అవకాశం ఉందని తెలిపారు.

Post a Comment