-->

నరసింహులపేట మండలంలో వ్యవసాయశాఖ తనిఖీలు

 

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: జిల్లా వ్యవసాయ అధికారి స్వర్ణ విజయ్ చంద్ర

నరసింహులపేట మండలంలో వ్యవసాయశాఖ తనిఖీలు

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: జిల్లా వ్యవసాయ అధికారి స్వర్ణ విజయ్ చంద్ర

మహబూబాబాద్, సెప్టెంబర్ 13: నరసింహులపేట మండలంలో వ్యవసాయశాఖ అధికారులు ఎరువుల విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి స్వర్ణ విజయ్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో పలు ఎరువుల దుకాణాలు, వ్యవసాయ సేవా కేంద్రాలను పరిశీలించారు.

పెదనాగారంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, వంతడుపులలోని పరమేశ్వర ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్, నరసింహులపేటలోని హకా ఫర్టిలైజర్, సుమన్ ట్రేడర్స్ ఎరువుల విక్రయ కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బిల్లుల పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అలాగే పీఓఎస్ మిషన్లలో నమోదైన ఎరువుల నిల్వలను ఆయా కేంద్రాల్లోని భౌతిక నిల్వలతో సరిపోల్చి ధ్రువీకరించారు.

ఎరువులను ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయించినా, లేదా రైతులు కోరని లింక్డ్ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేసినా కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి హెచ్చరించారు. సబ్సిడీ ఎరువులను తప్పనిసరిగా ఫర్టిలైజర్ యాప్, పీఓఎస్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని విక్రయదారులకు సూచించారు.

అనంతరం జయపురంలో డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా వాలంటీర్లు చేపడుతున్న పంటల నమోదును జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలించారు. రైతుల పంటల వివరాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. డిజిటల్ క్రాప్ సర్వేలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్తగా వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.

Blogger ఆధారితం.