హెచ్‌ఎంఎస్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా మడిపల్లి కరుణాకర్
హెచ్‌ఎంఎస్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా మడిపల్లి కరుణాకర్
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన సింగరేణి ఉద్యోగి మడిపల్లి కరుణాకర్‌కు హింద్ మజ్దూర్ సభ (HMS) యూనియన్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్‌మెంట్‌లో జనరల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మడిపల్లి కరుణాకర్‌ను హెచ్‌ఎంఎస్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించారు.
హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ ఈ నియామకాన్ని ప్రకటించారు. కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణతో పాటు యూనియన్‌ను మరింత బలోపేతం చేసే దిశగా కరుణాకర్ సమర్థవంతంగా పనిచేస్తారనే నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు యూనియన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కరుణాకర్‌కు డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి దక్కడం పట్ల యూనియన్ నాయకులు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ యూనియన్ నాయకులు, ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ యూనియన్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ వై. అంజనేయులు, సెక్రటరీ ఆసిఫ్, ఏరియా సెక్రటరీ గూగులో ప్రసాద్, వేకేసీఎం ఫిట్ సెక్రటరీ మధుర శ్రీనివాస్, ఆర్‌సీహెచ్‌పీ సెక్రటరీ దూలం ప్రవీణ్ కుమార్ తదితర యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కరుణాకర్‌కు నూతన బాధ్యతలు లభించిన సందర్భంగా పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.

Post a Comment