జగిత్యాల జిల్లాలో స్కూల్ విద్యార్థులకు ప్రమాదం.. 10 మందికి గాయాలు
జగిత్యాల జిల్లాలో స్కూల్ విద్యార్థులకు ప్రమాదం.. 10 మందికి గాయాలు
కోరుట్ల: జగిత్యాల జిల్లాలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన కలకలం రేపింది. కోరుట్ల పట్టణ శివారులోని వేములవాడ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న టాటా ఏస్ మ్యాజిక్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న సుమారు 10 మంది విద్యార్థులు గాయపడినట్లు సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన విద్యార్థులను వాహనాల ద్వారా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గల పూర్తి కారణాలు, గాయపడిన విద్యార్థుల పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.

Post a Comment