-->

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆహ్లే సున్నత్ జమాత్ అధ్యక్షుడిగా మొహ్మద్ యూసుఫ్ ఏకగ్రీవ ఎన్నిక

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆహ్లే సున్నత్ జమాత్ అధ్యక్షుడిగా మొహ్మద్ యూసుఫ్ ఏకగ్రీవ ఎన్నిక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆహ్లే సున్నత్ జమాత్ అధ్యక్షుడిగా మొహ్మద్ యూసుఫ్ ఏకగ్రీవ ఎన్నిక

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆహ్లే సున్నత్ జమాత్ జిల్లా అధ్యక్షులుగా మొహ్మద్ యూసుఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం జుమా నమాజ్ అనంతరం మస్జీద్ పెద్దలు, మత పెద్దలు, జమాత్ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మస్జీద్ పెద్దలు మొహ్మద్ యూసుఫ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లా ఆహ్లే సున్నత్ జమాత్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మస్జీద్ పెద్దలు మాట్లాడుతూ.. మొహ్మద్ యూసుఫ్ నాయకత్వంలో ఆహ్లే సున్నత్ జమాత్ మరింత బలోపేతం కావాలని, ముస్లిం సమాజ అభ్యున్నతి, ఐక్యత కోసం ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐకమత్యం, సోదరభావం పెంపొందించడంతో పాటు మతపరమైన, సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.

జిల్లా అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మొహ్మద్ యూసుఫ్ మస్జీద్ పెద్దలు, జమాత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జమాత్ అభివృద్ధికి, సమాజ సేవకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మస్జీద్ పెద్దలు, జమాత్ సభ్యులు, ముస్లిం సమాజ ప్రముఖులు తదితరులు పాల్గొని నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు మొహ్మద్ యూసుఫ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Blogger ఆధారితం.