-->

కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

 

కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు టీపీసీసీ సభ్యులు జేబీ శౌరి ఆధ్వర్యంలో నివాళులు

కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు టీపీసీసీ సభ్యులు జేబీ శౌరి ఆధ్వర్యంలో నివాళులు

కొత్తగూడెం: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కొత్తగూడెంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ సభ్యులు జేబీ శౌరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు.

ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ చిత్రపటానికి జేబీ శౌరి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కొత్తగూడెం సూపర్ బజార్ ఎంజీ రోడ్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు జేబీ శౌరి మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ చేసిన పోరాటం, దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సత్యం, అహింస, శాంతి, సహనం, సోదరభావం వంటి గాంధీజీ చూపిన మార్గాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ కేవలం దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికే కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికి సమానత్వం, సామాజిక న్యాయం, గౌరవం లభించాలనే లక్ష్యంతో జీవితాంతం కృషి చేశారని జేబీ శౌరి అన్నారు. గాంధీజీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

గాంధీజీ కలలు కన్న శాంతియుతమైన, స్వచ్ఛమైన, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఆయన సూచించారు. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సత్యం, అహింస మార్గంలో ముందుకు సాగడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో NSUI జిల్లా అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఆరిఫ్ ఖాన్, మాజీ కౌన్సిలర్ తంగేళ్ల లక్ష్మణ్, మాజీ చుంచుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బిక్షపతి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాము, కోటిరెడ్డి, దుగ్గి రాశి సమ్మయ్య, నిరంజన్, నిసార్, ఏలేటి వెంకటేశ్వర్లు, నరసయ్య, దామోదర్, పల్లి వేణు, భాను ప్రకాష్, ఏలూరి రాందాస్, మైనార్టీ నాయకులు ఎండీ ఫక్రుద్దీన్, షేక్ నయీమ్, యువజన నాయకులు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.