గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు (వీడియో)
గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
హైదరాబాద్: GO 317 బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు గాంధీ భవన్‌ను ముట్టడించేందుకు పిలుపునివ్వడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గాంధీ భవన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
GO 317 కారణంగా తమకు జరిగిన బదిలీల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. బాధితుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రత్యేకంగా GO 317 బాధిత ఉపాధ్యాయులను వారి ఇష్టానుసారం స్వగ్రామ జిల్లా లేదా సంబంధిత జోన్‌కు బదిలీ చేయాలని వారు కోరుతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ ముట్టడికి సిద్ధమయ్యారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు గాంధీ భవన్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Post a Comment