పట్టపగలే వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లేడీ చైన్ స్నాచర్ చోరీ
పట్టపగలే వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లేడీ చైన్ స్నాచర్ చోరీ
యాచారం: పట్టపగలే ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును లేడీ చైన్ స్నాచర్ అపహరించుకెళ్లిన ఘటన యాచారం మండలంలో గురువారం కలకలం రేపింది.
మండల పరిధిలోని చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన మారోజు వజ్రమ్మ (75) ఇంటి బయట ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వచ్చిన ఓ మహిళ.. గ్రామంలో వార్డు మెంబర్ ఎక్కడ ఉంటారని, గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయా అంటూ వజ్రమ్మతో మాటలు కలిపింది.
అనంతరం తనకు తాగేందుకు మంచినీళ్లు కావాలని ఆ మహిళ వృద్ధురాలిని కోరింది. దీంతో వజ్రమ్మ నీళ్లు తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్తుండగా, వెనుక నుంచి ఆమె మెడలో ఉన్న సుమారు 4 తులాల బంగారు గొలుసును లాక్కుంది. అనంతరం క్షణాల వ్యవధిలోనే స్కూటీపై అక్కడి నుంచి పరారైంది.
ఘటనతో షాక్‌కు గురైన వృద్ధురాలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చైన్ స్నాచర్ కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Post a Comment