-->

మానవతా విలువలను చాటిన సీరతున్నబీ ﷺ జీవితం

 

మార్కండేయ కాలనీలో తెలుగు దావత్ కార్యక్రమం.. 30 మందికి పైగా ముస్లిమేతర మహిళల హాజరు

మానవతా విలువలను చాటిన సీరతున్నబీ ﷺ జీవితం

మార్కండేయ కాలనీలో తెలుగు దావత్ కార్యక్రమం.. 30 మందికి పైగా ముస్లిమేతర మహిళల హాజరు

మార్కండేయ కాలనీ, అక్టోబర్ 1, 2026: ప్రవక్త ముహమ్మద్ ﷺ జీవితం, బోధనలు, మానవతా విలువలను పరిచయం చేస్తూ మార్కండేయ కాలనీలోని నాజియా కౌసర్ సాహెబా నివాసంలో గురువారం ప్రత్యేక తెలుగు దావత్ కార్యక్రమం నిర్వహించారు. జమాఅతే ఇస్లామీ హింద్ (JIH) మహిళా విభాగం, గోదావరిఖని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 30 మందికి పైగా ముస్లిమేతర మహిళలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ ﷺ జీవిత చరిత్రలోని ముఖ్య ఘట్టాలు, ఆయన బోధించిన శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం, మంచి నడవడి, దయ, కరుణ వంటి మానవతా విలువలను వివరించారు. సమాజంలో భిన్న వర్గాల మధ్య పరస్పర అవగాహన, స్నేహభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమానికి రెయిన్‌బో స్కూల్ వైస్ ప్రిన్సిపాల్, సైకాలజీ నిపుణురాలు శ్రీమతి రాజినీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీరతున్నబీ ﷺలో ప్రతిబింబించే మానవతా సందేశం, మంచి ప్రవర్తన, ఇతరులను గౌరవించడం, సామాజిక బాధ్యత వంటి అంశాలపై ఆమె వివరించారు.

తెలుగు భాషలో సీరతున్నబీ ﷺ సందేశాన్ని విస్తృతంగా పరిచయం చేయడంతో పాటు, వివిధ వర్గాల ప్రజల మధ్య పరస్పర అవగాహన, మానవతా విలువలు, సోదరభావాన్ని పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో హమీదా బేగం, సబీరా నాజ్, షాహిదా, ఆయిషా సిద్దిఖా, సనా తబస్సుమ్, నాజియా కౌసర్, ఫహీమున్నిసా, అస్రా అంజుమ్, ఆబిదా, ఇర్ఫానా తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.