అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వాసర్ల నాగమణి దంపతులకు ఘన సన్మానం
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వాసర్ల నాగమణి దంపతులకు ఘన సన్మానం
కొత్తగూడెం: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దిశ ఉమెన్ ప్రొటెక్షన్ చైర్‌పర్సన్ వాసర్ల నాగమణి దంపతులను ఘనంగా సన్మానించారు.
తెలంగాణ ఉద్యమకారులు కేజీఎస్ మాథ్యూస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాసర్ల నాగమణి దంపతులకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు. సమాజంలో మహిళల రక్షణ, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న వారిని గౌరవించడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధుల పట్ల గౌరవం, ఆప్యాయత, బాధ్యతలను గుర్తుచేస్తూ వారి అనుభవాలను సమాజ అభివృద్ధికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు.
సన్మాన కార్యక్రమంలో వాసర్ల నాగమణి దంపతులకు దీర్ఘసుమంగళీభవ, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని తెలంగాణ ఉద్యమకారులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

Post a Comment