-->

మధు యాష్కీ గౌడ్‌ను సన్మానించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్

 

ఏఐపీసీ చైర్మన్‌గా నియామకంపై హర్షం వ్యక్తం

మధు యాష్కీ గౌడ్‌ను సన్మానించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్

ఏఐపీసీ చైర్మన్‌గా నియామకంపై హర్షం వ్యక్తం

హైదరాబాద్/కొత్తగూడెం, అక్టోబర్ 1: ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రొఫెషనల్స్ కమిటీ (ఏఐపీసీ) చైర్మన్‌గా నియమితులైన మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌ను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఆయన స్వగృహంలో మధు యాష్కీ గౌడ్‌ను శాలువాతో సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాగా సీతారాములు యాదవ్ మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీగా మధు యాష్కీ గౌడ్ అందించిన సేవలు, విదేశాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం ఏఐపీసీ చైర్మన్‌గా కీలక బాధ్యతలు అప్పగించడం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు గర్వకారణమని పేర్కొన్నారు.

మధు యాష్కీ గౌడ్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్స్, విద్యావంతులను కాంగ్రెస్ పార్టీతో మరింతగా అనుసంధానం చేసేందుకు కృషి జరుగుతుందని నాగా సీతారాములు యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానం ఆయనపై ఉంచిన నమ్మకానికి ఈ నియామకం నిదర్శనమని తెలిపారు.

ఏఐపీసీ ద్వారా నిపుణులు, విద్యావంతులు, వివిధ వృత్తుల్లో ఉన్న ప్రతిభావంతులను కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, కార్యక్రమాలతో అనుసంధానం చేసే దిశగా మరింత చురుకైన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందన్నారు. మధు యాష్కీ గౌడ్ తన అనుభవంతో ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఏఐపీసీ చైర్మన్‌గా నియమితులైన మధు యాష్కీ గౌడ్‌కు నాగా సీతారాములు యాదవ్ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Blogger ఆధారితం.