-->

మణికొండలో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. అపార్ట్‌మెంట్‌లో చోరీ

మణికొండలో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. అపార్ట్‌మెంట్‌లో చోరీ


మణికొండలో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. అపార్ట్‌మెంట్‌లో చోరీ

హైదరాబాద్‌: మణికొండలో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:20 గంటల సమయంలో ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోకి ఆరుగురు అనుమానితులు ప్రవేశించినట్లు సమాచారం.

లేక్‌సైడ్‌ వైపు ఉన్న ఫెన్సింగ్‌ను కత్తిరించి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన దుండగులు సీ బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై దుండగులు ఆయుధాలతో దాడికి యత్నించినట్లు సమాచారం.

ఘటనతో అపార్ట్‌మెంట్‌ వాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ચోరీకి గురైన నగదు, బంగారం తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.