-->

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా UFBU కీలక ప్రకటన

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా UFBU కీలక ప్రకటన


బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా UFBU కీలక ప్రకటన 

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28: సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు జరగాల్సిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకటించింది.

ఆదివారం UFBU–ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) మధ్య జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిగాయి. చర్చలు సానుకూలంగా సాగడంతో ప్రస్తుతం సమ్మెను వాయిదా వేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.

ముఖ్యంగా శనివారాల్లో సెలవు అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ డిమాండ్‌పై పరిశీలించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీ తీసుకునే నిర్ణయం అనంతరం సమ్మెపై తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి.

దీంతో సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగించేలా ప్రకటించిన మూడు రోజుల సమ్మె ప్రస్తుతానికి వాయిదా పడినట్లైంది.

Blogger ఆధారితం.