-->

కొత్తగూడెంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

 

సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు యాదవ్

కొత్తగూడెంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు యాదవ్

కొత్తగూడెం: ఖమ్మం–వరంగల్–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కొత్తగూడెంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటా దేవీప్రసన్న అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఈ సమావేశానికి ఖమ్మం లోక్‌సభ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార వ్యూహాలు, అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

ఈ సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు యాదవ్‌తో పాటు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.