పద్మశాలి నాయకుల విజ్ఞప్తిపై స్పందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
పద్మశాలి నాయకుల విజ్ఞప్తిపై స్పందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
లక్ష్మీనారాయణ బలవన్మరణంపై సమగ్ర విచారణ.. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం: ఎస్పీ హామీ
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ బలవన్మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పద్మశాలి సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ బిరుదురాజు రోహిత్ రాజ్‌ను కోరారు. ఈ మేరకు ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కుమార్తె తన తండ్రి మృతికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని కన్నీటిపర్యంతమవుతూ విజ్ఞప్తి చేశారు. పద్మశాలి సంఘం నాయకులు సైతం ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.
బాధ్యులపై చట్టప్రకారం చర్యలు: ఎస్పీ
పద్మశాలి సంఘం నాయకులు, కుటుంబ సభ్యుల విజ్ఞప్తిపై స్పందించిన ఎస్పీ రోహిత్ రాజ్.. కేసును క్షుణ్ణంగా విచారించి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొంటూ, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు వై.ఎస్. రావు, గుండు రవికుమార్, వేముల ప్రసాద్ బాబు, వేముల సతీష్, వేముల మధుకర్, ఇమంది ఉదయ్ కుమార్, పుట్టా శంకరయ్య, తోటకూర శ్రీనివాసరావు, పిండిపోలు కన్నయ్య, దోమల కిషోర్, బొమ్మ రామకిషోర్, దోమల ప్రవీణ్, పెగడ శంకర్, ఆడెపు నాగరాజు, రాగిణి వెంకటేశ్వర్లు, వేల శివ, వేల జీవన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment