ప్రమాదానికి గురైన కానిస్టేబుల్‌కు తోటి బ్యాచ్‌మెట్స్ ఆర్థిక సహాయం
ప్రమాదానికి గురైన కానిస్టేబుల్‌కు తోటి బ్యాచ్‌మెట్స్ ఆర్థిక సహాయం
కొత్తగూడెం: విధి నిర్వహణలో భాగంగా వాహన తనిఖీలు చేస్తుండగా లారీ ఢీకొని గాయపడిన కానిస్టేబుల్ పి. రవికుమార్‌కు ఆయన తోటి బ్యాచ్‌మెట్స్ అండగా నిలిచారు. చికిత్స నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పి. రవికుమార్ వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో లారీ ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన మోకాలి భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో కొత్తగూడెంలోని గణేష్ టెంపుల్ ప్రాంతంలో ఉన్న వరుణ్ ఆసుపత్రిలో ఆయన మోకాలికి శస్త్రచికిత్స నిర్వహించారు.
ఈ విషయం తెలుసుకున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు స్పందించారు. అసోసియేషన్ తరఫున సభ్యులు చంద్రశేఖర్, మోహన్, జహీర్, లక్ష్మణరావు, సురేష్ తదితరులు రవికుమార్ చికిత్స కోసం తక్షణ ఆర్థిక సహాయంగా రూ.50,000 అందజేశారు.
ఆపద సమయంలో తోటి కానిస్టేబుల్‌కు అండగా నిలిచిన 2009 బ్యాచ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సేవాభావాన్ని పలువురు అభినందించారు. తోటి ఉద్యోగి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Post a Comment