కొత్తగూడెంలో కాంగ్రెస్ నూతన జిల్లా కార్యాలయానికి స్థల పరిశీలన
కొత్తగూడెంలో కాంగ్రెస్ నూతన జిల్లా కార్యాలయానికి స్థల పరిశీలన
త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం పట్టణం రైటర్ బస్తీలో కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు.
టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు యాదవ్, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, స్థానిక కాంగ్రెస్ నాయకులు, సంబంధిత అధికారులతో కలిసి మంత్రి స్థలాన్ని సందర్శించి నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నూతన జిల్లా కార్యాలయం అందుబాటులోకి వస్తే పార్టీ కార్యకలాపాలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని నాయకులు తెలిపారు.

Post a Comment