TBGKS ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం
TBGKS ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం
సింగరేణి కార్పొరేట్ కార్యాలయం ఎదుట ఉచిత ఆన్‌లైన్ ఓటరు నమోదు
కొత్తగూడెం newsupta9: త్వరలో జరగనున్న ఉమ్మడి నల్గొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆదేశాల మేరకు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్టోబర్ 30న ఉదయం 9 గంటల నుంచి సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఉచిత ఆన్‌లైన్ ఓటరు నమోదు సదుపాయాన్ని కల్పించారు.
ఈ సందర్భంగా సింగరేణిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు, కార్మికులతో పాటు అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందస్తుగా ఓటరుగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. పట్టభద్రులు ఈ ఉచిత ఆన్‌లైన్ నమోదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో TBGKS కార్పొరేట్ ఏరియా ఉపాధ్యక్షులు తుమ్మ శ్రీనివాస్ రావు, సెంట్రల్ కమిటీ నాయకులు ఎంటెక్ మహేందర్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు నవతన్, కార్పొరేట్ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ తేలిక శివకుమార్, TBGKS నాయకులు మహమ్మద్ అన్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment