-->

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జీతాల కోతపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం

 

జీవో 1195ను ప్రభుత్వం పునఃపరిశీలించాలి – తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జీతాల కోతపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం

జీవో 1195ను ప్రభుత్వం పునఃపరిశీలించాలి – తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం జీవో 1195 తీసుకురావడంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాలను తగ్గించడం అన్యాయమని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో కొంతమంది వేతనాలను నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు తగ్గించారని కవిత ఆరోపించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ, ద్రవ్యోల్బణం ఉద్యోగులపై ఆర్థిక భారాన్ని మోపుతున్న పరిస్థితుల్లో వేతనాలు తగ్గించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

ఉద్యోగుల వేతనాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని కవిత విమర్శించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల శ్రమను దోచుకుంటే సహించబోమని ఆమె హెచ్చరించారు.

ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వేతనాల కోతపై పునఃపరిశీలన చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఉద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Blogger ఆధారితం.