ఇకపై కిలో చెత్తకు రూ.3 వసూలు.. తెలంగాణలో కొత్త నిబంధనలు!

100 మందికి మించి దావత్‌లు, వేడుకలు నిర్వహిస్తే ముందస్తు అనుమతి తప్పనిసరి


ఇకపై కిలో చెత్తకు రూ.3 వసూలు.. తెలంగాణలో కొత్త నిబంధనలు!

100 మందికి మించి దావత్‌లు, వేడుకలు నిర్వహిస్తే ముందస్తు అనుమతి తప్పనిసరి

తెలంగాణలోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు. ఇకపై 100 మందికి మించి హాజరయ్యేలా వేడుకలు, దావత్‌లు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేశారు.

ఈ మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమాచారం అందించి అనుమతి పొందాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాకుండా వేడుకల సందర్భంగా పెద్ద మొత్తంలో పేరుకుపోయే చెత్తను నిర్వాహకులే సేకరించి అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకోసం సేకరించిన చెత్తకు కిలోకు రూ.3 చొప్పున చెల్లించాలని అధికారులు కొత్త నిబంధన విధించారు. ఈ నిబంధనలతో ఇకపై భారీ వేడుకలు, దావత్‌లు నిర్వహించే నిర్వాహకులపై అదనపు భారం పడనుంది.


Blogger ఆధారితం.