తెలంగాణలో గుండాల రాజ్యం.. అవినీతి రాజ్యం నడుస్తోంది: ఎమ్మెల్యే రాజాసింగ్

తెలంగాణలో గుండాల రాజ్యం.. అవినీతి రాజ్యం నడుస్తోంది: ఎమ్మెల్యే రాజాసింగ్


 తెలంగాణలో గుండాల రాజ్యం.. అవినీతి రాజ్యం నడుస్తోంది: ఎమ్మెల్యే రాజాసింగ్

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. నిన్న రాజగోపాల్ రెడ్డి వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధుల సమస్య కానీ, కమ్యూనికేషన్ గ్యాప్ కానీ ఎప్పుడూ రాలేదని రాజాసింగ్ అన్నారు. నిధులు అడిగినప్పుడు లేవని చెప్పిన సందర్భాలు లేవని పేర్కొన్నారు.

గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేశారని అన్నారు. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తనతో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలకే నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు.

బంగారు తెలంగాణ సాధించాలంటే ప్రతి నియోజకవర్గంలో సమానంగా అభివృద్ధి జరగాలని, ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. ఇదేనా పాలన తీరు రేవంత్ రెడ్డి? ఇది పద్ధతి కాదు అంటూ రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Blogger ఆధారితం.