ఎంఐఎం నేత దారుణ హత్య.. కత్తులతో విచక్షణారహితంగా దాడి!
ఎంఐఎం నేత దారుణ హత్య.. కత్తులతో విచక్షణారహితంగా దాడి!
గండిపేట: రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎంఐఎం నాయకుడు ముర్తుజ అలీ (ముర్తుజ పహిల్వాన్) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ముర్తుజ పహిల్వాన్ సోమవారం సాయంత్రం హిమాయత్ సాగర్ ఎకో పార్కు సమీపంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దుండగుల దాడిలో ముర్తుజ అలీ తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను వెంటనే అత్తాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.
హత్యకు కారణాలపై పోలీసుల విచారణ
ముర్తుజ పహిల్వాన్ ఎంఐఎం నాయకుడిగా స్థానికంగా గుర్తింపు పొందారు. ఆయనపై దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక లావాదేవీల వివాదాలా? పాత కక్షలా? లేక వ్యక్తిగత విభేదాలా? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
దాడికి పాల్పడిన నిందితులు ఎవరు? హత్యకు ముందస్తు పథకం ఏమైనా ఉందా? అనే అంశాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment