ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!


ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ వెంకట్‌తో పాటు ఆయన భార్య, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మంగళవారం అర్ధరాత్రి సుమారు 3.30 గంటల సమయంలో కొత్తూరు శివారులోని వినాయక్ స్టీల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు ఆయన భార్య ఇందుజ, బావమరిది చాణక్య, డ్రైవర్ శ్రీకాంత్ ఉన్నారు. లారీ ఢీకొట్టడంతో కారులో ఉన్న నలుగురికీ స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రమాద తీవ్రతను చూస్తే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ నలుగురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. కారు పూర్తిగా ధ్వంసమైనా.. ఎమ్మెల్సీ కుటుంబానికి ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Blogger ఆధారితం.