ఇంట్లో 32 నాగు పాము పిల్లలు ఎక్కడో?
ఇంట్లో 32 నాగు పాము పిల్లలు ఎక్కడో తెలుసా?
ఇంట్లో 32 నాగు పాము పిల్లలు ఎక్కడో? పాము పేరు చెపితేనే సహజంగా అందరికీ భయం వేస్తోంది. అందులో నాగు పాము అంటే అందరికీ ముచ్చెమటలు పడతాయి.
అలాంటిది ఓ ఇంట్లో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 నాగు పాము పిల్లలు గుంపుగా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం నెహ్రూ బస్తీకి చెందిన కరెంటు ఎలక్ట్రిషన్ రాజు ఇంటి గోడకు ఉన్న రంధ్రంలో పాము పిల్లలు కనిపించడంతో స్నేక్ క్యాచర్ టీమ్ కు సమాచారం అందించిన కరెంట్ ఎలక్ట్రిషన్ రాజు.
ఒక నాగుపాము, 32 నాగుపాము పిల్లలను పట్టుకున్న స్నేక్ క్యాచర్ దత్తు టీం సభ్యులు. కరెంటు ఎలక్ట్రిషన్ రాజు కుటుంబ సభ్యులకు తప్పిన పెను ప్రమాదం.
కొత్తగూడెం నెహ్రు బస్తీలో ఏరియాలో నివాసం ఉంటున్న ఎలక్ట్రిషన్ రాజు అనే ఓ వ్యక్తి ఇంటి గోడలో ఉన్న పాము పిల్లలను గమనించిన కుటుంబ సభ్యులు.. స్నేక్ క్యాచర్ దత్తు బృందానికి సమాచారం ఇచ్చారు.వారు కొన్ని గంటల పాటు శ్రమించి పెద్ద పాము తో పాటు మొత్తం 32 నాగు పాము పిల్లలను,చాకచక్యంగా పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. దీంతో కుటుంబ సభ్యులకు పెను ప్రమాదం తప్పింది.

Post a Comment