-->

రవాణాశాఖ ఉదోగి మద్యం తాగుతూ విధులు ఉదోగి తొలగింపు

రవాణాశాఖ ఉదోగి మద్యం తాగుతూ విధులు ఉదోగి తొలగింపు

 రవాణాశాఖ ఉదోగి మద్యం తాగుతూ విధులు ఉదోగి తొలగింపు

మహబూబాబాద్‌ జిల్లాలో మద్యం తాగుతూ విధులు నిర్వహించిన ఘటనపై రవాణాశాఖ తీవ్రంగా స్పందించింది. రవాణాశాఖ కార్యాలయంలో బీరు తాగుతూ విధులు నిర్వహించిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఈ సురేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు అతడి పేరును బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు బాధ్యుడిగా జిల్లా ట్రాన్స్‌పోర్ట్‌ అధికారి, ఎంవీఐ ఎండీ గౌస్‌పాషాకు ఉన్నతాధికారులు చార్జ్‌మెమో జారీ చేశారు. కార్యాలయంలోకి మద్యం తీసుకొచ్చిన ఇద్దరు ఆర్టీఏ ఏజెంట్లు మధు, సాధిక్‌తోపాటు సురేశ్‌పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో మహబూబాబాద్‌ రవాణాశాఖ కార్యాలయంలో మూడేండ్లుగా విధులు నిర్వహిస్తున్న వారందరినీ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలకు అప్పగిస్తూ రవాణాశాఖ కమిషనర్‌ డాక్టర్‌ బుద్ధప్రకాశ్‌ జ్యోతి ఆదేశాలు జారీ చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793