బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఎంపీ మల్లు రవి
*బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఎంపీ మల్లు రవి*
*కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరిత తిరుపతయ్య సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ*
గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్ లోని ప్రభుత్వ బీసీ బాలికల వసతిగృహాన్ని శుక్రవారం జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్యతో కలిసి నాగర్‌కర్నూ ల్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి సందర్శించారు.
జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులతో పాటు హాస్టల్ గదులు, మరుగుదొడ్లు, భోజనశాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాలు మల్లు రవి చేతులమీదుగా అందజేశారు.
వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని, సమస్యలను జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు గాను ప్రభుత్వం దృష్టికి తీసుకురావా లని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డీబీసీడీఓ శ్వేత ప్రియదర్శిని, హాస్టల్ వార్డన్ ప్రమీల, జయరాం నాయక్, మధుసూదన్, తదితరులు ఉన్నారు...

Post a Comment