-->

ముఠాగా ఏర్పడి దందా చేస్తున్న చికెన్ షాప్స్

ముఠాగా ఏర్పడి దందా చేస్తున్న చికెన్ షాప్స్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో ఓ చికెన్ షాపుల యూనియన్ మాఫియాలా తయారై అధిక ధరలకు చికెన్లు విక్రయిస్తూ వినియోగదారుడి జోబుకి చిల్లు పెడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో హెచ్చు మీరిపోయిన యూనియన్ సభ్యులు తక్కువ ధరలకు చికెన్ అమ్మే షాపులపై దాడులు చేస్తున్నారు. ప్రభుత్వ మార్కెట్ ధర 220 రూపాయలు ఉండగా అశ్వరావుపేటలో ఈ మాఫియా 270 నుంచి 290 రూపాయలు వరకు ఇష్టానుసారంగా అమ్మి వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నారు. 

అశ్వరావుపేట యూనియన్ లో లేని ఓ దుకాణదారుడు 200 రూపాయల మార్కెట్ ధరకే బోర్డు పెట్టి చికెన్ విక్రయిస్తుండటంతో ఆగ్రహించిన యూనియన్ సభ్యులు సదరు షాపు పై దాడి చేసి అడ్డు వచ్చిన వర్కర్ ని సైతం చావబాదారు, షాపులో మానేయాలంటూ హుకుం జారీ చేశారు.

న్యాయంగా మార్కెట్ ధరకు అమ్ముతుంటే ఇలాంటి దాడులు చేయడంపై షాప్ యజమాని న్యాయ పోరాటానికి సిద్ధపడుతుండగా, దాడిలో గాయాల పాలైన చికెన్ షాపు వర్కర్ ని హాస్పిటల్ కి తరలించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793