ప్రేమజంట ఆత్మహత్యయత్నం ఒకరు మృతి
బయ్యారం మండలంలో ప్రేమజంట ఆత్మహత్యయత్నం ఒకరు మృతి ప్రాణాపాయస్థితిలో మరొకరు..*
*మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన* కొటెం లక్ష్మీనారాయణ, నీలమ్మ దంపతుల కుమార్తె రవళి (21)కి మూడేళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం కాగా.. భర్తతో మనస్పర్థల కారణంగా కొంతకాలంగా రవళి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో కోటగడ్డకు చెందిన 23 ఏళ్ల మెండు రవీందర్‌తో రవళికి పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమకు దారితీసింది. కొన్నాళ్ల క్రితం రవీందర్ తల్లిదండ్రులు యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి సమీపంలోని ఓ గ్రామానికి వలస వెళ్లడంతో అతను అక్కడే ఉంటున్నాడు.
అప్పుడప్పుడు స్వగ్రామైన కోటగడ్డకు రాకపోకలు సాగిస్తున్నాడు. కాగా, సుమారు *మూడు నెలల క్రితం రవీందర్, రవళి కనిపించకుండా పోయారు.* ఆ సమయంలోనే వారు వివాహం చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే తమ కూతురు కనిపించడంలేదని రవళి తల్లిదండ్రులు, తమ కుమారుడు కనిపించడంలేదని రవీందర్ కుటుంబ సభ్యులు రాయగిరి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు. దీంతో అదృశ్యం కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణచేపట్టి రవీందర్‌ను, రవళిని తీసుకొచ్చి వారి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు.

Post a Comment