తెలంగాణ గవర్నర్ అశ్విని కుమార్ దేశవ్యాప్తంగా గవర్నర్ ల మార్పు రంగం సిద్ధం
*మోడీకి అత్యంత సన్నిహితుడు:*
1953 జనవరిలో బిహార్ లో జన్మించిన అశ్విని కుమార్ చౌబే ఆ రాష్ట్ర రాజకీయాల్లో నుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు, నమ్మదగిన వ్యక్తి అనే పేరున్న అశ్విని కుమార్ గత ప్రభుత్వంలో మోడీ కేబినెట్ లో పని చేశారు. అయోధ్య రామ మందిరం నిర్మాణ ప్రక్రియలో కీలక అశ్విని కుమార్ కీల పాత్ర పోషించారు. అయితే తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహారచన చేస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ఈ మేరకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతంపై దృష్టి సారించి కాశాయపార్టీ ప్రభుత్వం రాజ్యంగబద్ధమైన పదవుల విషయంలోనూ జోరుపెంచినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం ఇన్ చార్జి గవర్నర్ స్థానంలో మోడీకి అత్యంత నమ్మకస్తుడైన అశ్విని కుమార్ చౌబే పేరును గవర్నర్ గా పంపించాలని భావిస్తున్నారనే టాక్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తగా మారింది.
*కర్నాటకకు కిరణ్ కుమార్ రెడ్డి:*
ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కిరణ్ కుమార్ రెడ్డికి సైతం గవర్నర్ పోస్ట్ వరించబోతున్నదని అయితే అతన్ని కర్ణాటకకు నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాది క్రితం బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా అధిష్టానం నియమించింది. ఈ క్రమంలో ఆయన్ను గవర్నర్ గా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణకే గవర్నర్ గా పంపించబోతున్నారనే ప్రచారం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో సమైక్యవాదిగా ముద్రపడిన కిరణ్ కుమార్ రెడ్డిని ఎలా గవర్నర్ గా నియమించబోతున్నారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వ్యక్తం అయ్యాయి. దీంతో ఆయన్ను కర్ణాటక గవర్నర్ గా నియమించబోతున్నట్లు తెలుస్తోంది

Post a Comment