Mardder: మహిళ దారుణ హత్య. బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన నిందితుడు
*మహిళ దారుణ హత్య. బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన నిందితుడు*
*జయశంకర్ భూపాలపల్లి* జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. మహిళను చున్నీతో దారుణంగా హత్య చేసి ఆమెపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్లిన సంఘటన భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని ఫకీర్ గడ్డ ప్రాంతంలో మంగళవారం జరిగింది.
ఫకీర్ గడ్డకు చెందిన ఇస్లావత్ సుమతి అనే మహిళను ఇంటి వద్దనే మెడకు చున్నీ తో చుట్టి హత్య చేసి పక్కనే శవాన్ని పడేశారు. సుమతి శరీరంపై ఉన్న బంగారాన్ని హత్య చేసిన వ్యక్తి దోచుకెళ్ళి నట్లు సమాచారం. కట్టుకున్న భర్తే కాలయముడై కాటికి పంపినట్లు చర్చించుకుంటున్నారు. మృతురాలు సుమతికి కొడుకు కూతురు ఉన్నారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇస్లావత్ సుమతిని ఎవరు హత్య చేశారు అందుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు పోలీస్ స్టేషన్ లో రాతపూర్వక ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు అధికారిక సమాచారాన్ని ఇవ్వలేదు.

Post a Comment