దుర్గమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
*దుర్గమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్*
వేములవాడ పట్టణంలోని 14 వార్డు న్యూ అర్బన్ కాలనీ లో గోత్రాల సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గమ్మ బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు..ప్రభుత్వ విప్ ను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు..
ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ప్రజలు పాడిపంటలతో ఆనందంగా ఉండాలని వేడుకొన్నారు... వారి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ నాయకులు చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, కనికరపు రాకేష్, తుమ్ మధు, నామాల లక్ష్మీరాజం, గూడూరి మధు, పుల్కం రాజు, అన్నారం శ్రీనివాస్, అంబాటి చందు, అబ్రహం, తదితరులు ఉన్నారు.

Post a Comment