నటి హేమకు బెయిల్ మంజూరు
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన తెలుగు సినీ నటి హేమకు స్థానిక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆమె నుంచి డ్రగ్స్‌ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.
ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు నేర నియంత్రణ దళం (సీసీబీ) న్యాయవాది కోర్టుకు అందజేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.

Post a Comment