-->

రామగుండం పవర్ స్టేషన్ ను సింగరేణికి అప్పగించొద్దు పవర్ ఎంప్లాయిస్ జేఏసి


 రామగుండం పవర్ స్టేషన్ ను సింగరేణికి ప్పగించొద్దు పవర్ ఎంప్లాయిస్ జేఏసి

రామగుండం పవర్ స్టేషన్ ను సింగరేణికి అప్పగించొద్దు పవర్ ఎంప్లాయిస్ జేఏసి
జెన్కోకు చెందిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ను మూసివేసి సుమారుగా 580 ఎకరాల స్థలాన్ని సింగరేణికి అప్పగించి సింగరేణి ఆధ్వర్యంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ సాయిబాబా తెలిపారు.

దీంతో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈమేరకు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ రోనాల్డ్ రాస్ ను కలిసి వినతి అందజేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కోను నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పూర్తిగా బలపరచాలని, ప్రభుత్వం నిర్మించబోయే నూతన ప్రాజెక్టులను అన్నింటినీ జెన్కో ద్వారానే నిర్మించాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారన్నారు.

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంస్కరణల్లో భాగంగా ట్రాన్స్ కో, జెన్కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ఏర్పాటు చేసిందని, అందులో భాగంగా తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో జల, థర్మల్ విద్యుత్ కేంద్రాలు విజయవంతంగా నడుపుతూ దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులను దక్కించుకుందన్నారు. కావున ప్రభుత్వం చేపట్టబోయే అన్ని థర్మల్, జల విద్యుత్, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులను ప్రభుత్వ రంగంలోని జెన్కో ద్వారా నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ జేఏసీ వైస్ చైర్మన్లు వజీర్, అనిల్ కుమార్, జేఏసీ నాయకులు వెంకట నారాయణ రెడ్డి, ఈశ్వర్ గౌడ్, నెహ్రూ, సదానందం, సురేష్ కుమార్, పివీ రావు, వేణుగోపాల్, కుమార స్వామి, మోసెస్ పాల్గొన్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793