-->

అంగన్వాడి బడిబాట - చిన్నారుల జీవితానాకీ పూలబాట సహారా బేగం

 

అంగన్వాడి బడిబాట - చిన్నారుల జీవితానాకీ పూలబాట సహారా బేగం

బడి బాట కార్యక్రమం 25వ వార్డు గాజులరాజం బస్తి 5, 6, 7 సెంటర్ల ఆధ్వర్యంలో జరిగిన బడిబాట  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక కౌన్సిలర్ సాహేర బేగం   పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమంలో చిన్నారులు, తల్లులు, పెద్దలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాహేర బేగం  మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో రెండున్నర సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలు లోపు బడి బయట పిల్లల్ని తప్పకుండా అంగన్వాడి కేంద్రాలకు పంపాలని సాహేర బేగం కోరారు. 

అంగన్వాడి సెంటర్ లో చిన్నారులకు మానసిక శరీరకవృద్ధి, వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్యపరీక్షలు, పౌష్టికాహారం, ఆటపాటలతో కూడిన విద్యా సామూహిక అక్షర అభ్యాసాలు, పాలు గుడ్డు, ఒక పూట సంపూర్ణ ఆహారం అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్నారని తెలిపారు. అంగన్వాడి బడిబాట చిన్నారుల జీవితానికి పూలబాటని తెలిపారు. తల్లిదండ్రులు అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంగన్వాడి బడిబాట కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో*అంగన్వాడి బడిబాట - చిన్నారుల జీవితానాకీ పూలబాట. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్ వైజర్ శారద, అంగన్‌వాడీ టీచర్లు పద్మ, శైలజ, రాజకుమారి, అయ్యలు, ఆర్.పి రాజకుమారి, ఓబ్ అనూష, పిల్లల తల్లులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793