-->

సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి అవగాహన కార్యక్రమంలో DWO విజేత, ACDPO అరుణ కుమారి

సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి అవగాహన కార్యక్రమంలో DWO విజేత, ACDPO అరుణ కుమారి

 *సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి అవగాహన కార్యక్రమంలో DWO విజేత, ACDPO అరుణ కుమారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హనుమాన్ బస్తి 25వ వార్డులో జరిగిన సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి కార్యక్రమం స్థానిక కౌన్సిలర్ సాహెరా బేగం ఆధ్వర్యంలో జరిగింది.

  ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి రహిత భారత్ గా మార్చడానికి పిలుపునివ్వడం జరిగిందని దానిలో భాగంగా, సికిల్ సెల్ ఎనీమియా వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధులలో ఒకటి, ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణంపై ప్రభావం చూపుతుంది, ఇది శరీరం అంతటా ఆక్సిజన్ ప్రభావం చూపుతుందని తెలిపారు.

 సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి యొక్క లక్షణాలు, రక్త కణాల సంఖ్య తగ్గడం, కళ్ళు పసుపు రంగులోకి మారటం, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు మరియు కీళ్ల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తరచుగా వచ్చే అంటూ వ్యాధులు, గర్భధారణ సమయంలో సమస్యలు, అవయవ వైఫల్యం, పెరుగుదల సమస్యలు, సికిల్ సెల్ ఎనీమియా సికిత్స ప్రధానంగా నొప్పుల ఎపిసోడ్లను తగ్గించడం, లక్షణాలను తగ్గించడం జరుగుతుంది. 

ఈ కార్యక్రమంలో మెప్మా సభ్యులు, అంగన్ వాడి టీచర్లు, ఆశాలు, ఏ ఎన్ ఎంలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793