మానసిక వేదనతో మరణించిన ఎసై మరణం బాధాకరం
మానసిక వేదనతో మరణించిన ఎసై మరణం బాధాకరం
ఎన్టీఆర్ జిల్లాలో ఎస్సై గా పనిచేస్తున్న ఏ. నాగేశ్వరరావు ను ఎన్నికల బదిలీల లో భాగంగా భీమవరం బదిలీ చేశారు. మూడునెలల్లోనే యదావిధిగా పాత స్థానాలకు వేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశాడు. ఐదు నెలలు గడిచాయి అయినా వీరిని పట్టించుకున్న వారు లేరు. ఒక పక్క రిటైర్మెంట్ దగ్గర పడుతుంది. ఈఆలోచనలతో నిత్యం సతమతమవుతూ తన బాదను దిగమింగుకుని ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి నైట్ రౌండ్స్ వెళ్లి ఇంటికి చేరుకున్నాడు.
తెల్లవారిన తరువాత కూడా భర్త ఇంటికి రాకపోవడాన్ని గమనించిన భార్య ఉదయాన్నే తన తోటి ఉద్యోగులకు ఫోన్ చేసి సార్ ఎక్కడ ఉన్నారు ఇంకా ఇంటికి రాలేదు అని ఆరా తీసింది. మేడం సార్ నాలుగు గంటలకే ఇంటికి వచ్చేశారు నేను మా ఇంటికి వచ్చేశాను అని చెప్పాడు.
అన్ని చోట్లా వెతకగా తను ఉంటున్న అపార్ట్మెంట్ లోని సెల్లార్ లో ఉన్న కారులో చనిపోయి ఉన్నాడు. కొద్ది రోజుల్లో రిటైర్మెంట్ అయ్యి 40 సంవత్సరాల బెనిఫిట్ లు పొందాల్సిన ఎస్సై ఎవ్వరూ లేని అనాధ చావు చనిపోవడం బాధాకరం.

Post a Comment