-->

బావిలో దూకి వృద్ధ దంపతులు ఆత్మహత్య

బావిలో దూకి వృద్ధ దంపతులు ఆత్మహత్య
బావిలో దూకి వృద్ధ దంపతులు ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామంలో వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పగిడేరుకు చెందిన కాసరబాద రామచంద్రయ్య(80), అతని భార్య సరోజనమ్మ(75)లు గ్రామంలోని ఎస్టీ కాలనీలో నివసిస్తున్నారు. 

వీరికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారులు అదే మండలంలోని గొల్లకొత్తూరు గ్రామంలో నివసిస్తున్నారు. వృద్ధ దంపతులు విడిగా ఉంటున్నారు.

ఆదివారం సాయంత్రం సమయంలో ఇంటినుంచి బయటికి వెళ్లిన వృద్ధ దంపతులు తిరిగి రాలేదు. గ్రామస్థులు, కుటుంబసభ్యులు వెతకగా వ్యవసాయ బావి వద్ద వీరిద్దరి చెప్పులు, ఇతర వస్తువులు లభించాయి. బావిలో వెతకగా సరోజనమ్మ మృతదేహం దొరికింది.

 రామచంద్రయ్య మృతదేహం కోసం ఈతగాళ్లతో గాలిస్తున్నారు. సరోజనమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వృద్ధ దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793