-->

హైదరాబాద్ లో అంబ‌రాన్ని అంటిన బోనాల సంబ‌రాలు

హైదరాబాద్ లో అంబ‌రాన్ని అంటిన బోనాల సంబ‌రాలు

 హైదరాబాద్ లో అంబ‌రాన్ని అంటిన బోనాల సంబ‌రాలు!

హైద‌రాబాద్ : ఆషాడ‌మాసం బోనాలు సంద‌ర్భంగా ఈ వారం పాత‌బ‌స్టీ లాల్ ద‌ర్వాజాలో బోనాలు పండ‌గ జ‌రుగుతుంది. దీంతో పాత‌బ‌స్తీలో పండ‌గ వాతావ‌ర‌ణం నెలకొంది. 

లాల్ ద‌ర్వాజాలోని సింహవాహిని మహాంకాళి అమ్మ‌వారి, అలాగే అక్క‌న్న‌, మాద‌న్న ఆల‌యాలు వ‌ద్ద ఉద‌యం నుంచే భ‌క్తులు చేరుకుని బోనాలు స‌మ‌ర్పిస్తున్నారు. 

భారీ సంఖ్య‌లో న‌గ‌ర ప్ర‌జ‌లు వ‌చ్చి మ‌హంకాళీ అమ్మ‌ వారితోపాటు అక్కన్న మాద‌న్న‌ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు. దీంతో ఆ రెండు ఆల‌యాల వ‌ద్ద భ‌క్తుల సంద‌డి నెల‌కొంది.

*ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన డిప్యూటీ సీఎం*

పాత‌బ‌స్తీ లాల్ ద‌ర్వాజాలో బోనాలు పండగ సంద‌ర్భం గా సింహ‌వాహిని మ‌హం కాళి అమ్మ‌వారికి ప్ర‌భుత్వం త‌రుఫున డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. 

ఈ సంద‌ర్భంగా ఆల‌య అధికారులు, అర్చ‌కులు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం అమ్మ‌వారి వ‌ద్ద భ‌ట్టి దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం ఆల‌య అర్చ‌కులు ఆశీర్వ‌చ‌న‌లతోపాటు అమ్మ‌వారి ప్ర‌సాదం అంద‌జేశారు.

*ప్ర‌త్యేక క్యూ ద్వారా బోనాల స‌మ‌ర్పిస్తున్న మ‌హిళ‌లు*

అమ్మ‌వారికి బోనాలు స‌మ‌ర్పించ‌డం కోసం మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. దీంతో ప్ర‌త్యేక క్యూ లైన్ ద్వారా అమ్మ‌వారి ఆల‌యానికి వెళ్లి మ‌హిళ‌లు బోనాలు స‌మ‌ర్పిస్తున్నారు. భ‌క్తుల తోపులాట లేకుండా పోలీసులు ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అక్క‌న్న‌, మాద‌న్న ఆల‌యం లో కూడా మ‌హిళ‌లు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు.

*భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన కోమ‌టిరెడ్డి*

చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. 

ఈ సంద‌ర్భంగా ఆల‌య అధికారులు, అర్చ‌కులు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం అమ్మ‌వారి వ‌ద్ద కోమ‌టిరెడ్డి దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. 

అనంత‌రం ఆల‌య అర్చ‌కులు ఆశీర్వ‌చ‌న‌ల తోపాటు అమ్మ‌వారి ప్ర‌సాదం అంద‌జేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793