ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్ ఇద్దరు యువకులు మృతి
*ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్ ఇద్దరు యువకులు మృతి*
హైదరాబాద్ లోని చందా నగర్ లో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సును ఓ బైకు రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు.
కాగా, మృతులను చందా నగర్‌కు చెందిన మనోజ్, రాజులుగా గుర్తించారు. ఇక, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమ్మితం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే, మదీనాగుడ జీఎస్ఎం మాల్ నుంచి చందానగర్‌కు బైక్‌పై మనో జ్, రాజులు వెళుతున్నారు. చందానగర్ జీఎస్ఎం మాల్ సమీపంలో యుటర్న్ దగ్గర రాంగ్ రూట్‌లో వెళుతూ.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టారు.
బైక్ నడుపుతున్న మనోజ్ తో పాటు వెనకాల కూర్చున్న రాజు కూడా అక్కడిక్కడే చనిపోయాడు.

Post a Comment