నాలుగు సంవత్సరాల చిన్నారిపై కామాంధుడు అత్యాచారయత్నం..
నాలుగు సంవత్సరాల చిన్నారిపై కామాంధుడు అత్యాచారయత్నం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి బస్తీలో దారుణం చోటుచేసుకుంది. అన్యం పుణ్యం ఎరుగని నాలుగు సంవత్సరాల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసేందుకు ఒడి కట్టాడు...
సభ్యసమాజం సిగ్గుపడే లాంటి ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మహబూబ్నగర్ ప్రాంతానికి చెందిన ఆంజనేయులు అనే యువకుడు కొంతకాలం క్రితం బ్రతుకు దరువు కోసం శంషాబాద్ వచ్చాడు.
సిద్ధంతి బస్తీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇతడు ఉంటున్న భవనంలోనే చిన్నారి తల్లిదండ్రులు అద్దెకు ఉంటున్నారు. చిన్నారి తల్లిదండ్రులు లేని సమయం చూసిన కామాంధుడు చిన్నారికి మాయమాటలు చెప్పి తాను ఉంటున్న గదిలోకి తీసుకెళ్లాడు.
అన్యం పుణ్యం ఎరుగని చిన్నారి పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో చిన్నారి అరుపులు కేకలు వేయడంతో భయపడి బయటకు పరుగులు తీశాడు నిందితుడు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూస్తేసరికి చిన్నారి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఏం జరిగిందో చెప్పడం కూడా రాక దిక్కులు చూస్తూ ఉండిపోయింది.
గమనించిన స్థానికులు నిందితుడు ఆంజనేయులుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సభ్య సమాజం సిగ్గుపడే లాంటి ఈ ఘటన పునారావృత్తం కాకుండా నిందితుడికి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను వేడుకుంటున్నారు.

Post a Comment