-->

బిట్రగుంట రైల్వే స్టేషన్‌లో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు... ప‌లు రైళ్ల‌కు తీవ్ర అంత‌రాయం

బిట్రగుంట రైల్వే స్టేషన్‌లో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు... ప‌లు రైళ్ల‌కు తీవ్ర అంత‌రాయం

 బిట్రగుంట రైల్వే స్టేషన్‌లో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు... ప‌లు రైళ్ల‌కు తీవ్ర అంత‌రాయం

నెల్లురూ జిల్లాలో ఓ గూడ్స్ ట్రైన్ ప‌ట్టాలు త‌ప్పింది. నేటి తెల్ల‌వారుజామున ఐదు గంట‌ల స‌మ‌యంలో బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డులో గూడ్స్ ట్రైన్ ప‌ట్టాలు త‌ప్పింది.

 ఈ గూడ్స్ ట్రైన్‌ నెల్లూరు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డులోకి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిన‌ట్లు తెలుస్తోంది.

 ఈ ప్ర‌మాద స‌మ‌యంలో క్రాసింగ్ వద్ద రెండు వ్యాగన్లు పట్టాలు తప్పిన‌ట్లు స‌మాచారం.

వెంట‌నే సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని, రోడ్ ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేసేందుకు త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అత్యవసర రైళ్లను మూడో లైన్‌లోకి పంపించాలని అధికారులు నిర్ణయించారు. వీటితోపాటు మిగిలిన రైళ్లకు కూడా అంత‌రాయం లేకుండా అధికారులు తగు చ‌ర్య‌లు చేప‌ట్టారు. 

ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌వైపు వెళ్లే ప‌లు రైళ్లు ఆల‌స్యంగా న‌డ‌వ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. కొద్ది గంట‌ల స‌మ‌యంలో రైళ్ల రాక‌పోక‌లు యాథావిధిగా ఉంటాయ‌ని అధికారుల సూచించారు

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793