లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్ ఎస్సై
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్ ఎస్సై
*పాల్వంచ టౌన్ ఎస్.ఐ బాణాల రాము గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.*
*అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుంచి ఎస్ఐ రాము రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు.*
*ఈ కేసు వాదిస్తున్న న్యాయవాది లక్ష్మారెడ్డి కి మహిళ ఈ విషయం చెప్పింది.*
*దీంతో న్యాయవాది ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు.*
*తన ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు ఎస్ఐ ను పట్టుకున్నారు.*

Post a Comment