-->

పెద్దవాగు ప్రాజెక్ట్ ఆనకట్ట మరమ్మత్తు చేపట్టాలి మంత్రి తుమ్మల

 

పెద్దవాగు ప్రాజెక్ట్ ఆనకట్ట మరమ్మత్తు చేపట్టాలి మంత్రి తుమ్మల

పెద్దవాగు ప్రాజెక్ట్ ఆనకట్ట మరమ్మత్తు  పనులు యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాలి : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 

....పెద్దవాగు ప్రాజెక్ట్ ఆనకట్ట మరమ్మత్తు పనులు సత్వరమే చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు 

....ఈ వానాకాలం సీజన్ లోనే రైతులకు సాగునీరు పంటలకు అందే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని మరమ్మత్తులు కోసం ఎస్టిమేట్స్ సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలు 

....తాత్కాలిక పనుల కోసం బండ్ ఫార్మేషన్ మరియు అప్రోచ్ కెనాల్ పనులు కోసం  మూడున్నర కోట్ల తో ఎస్టిమేట్స్ సిద్ధం చేసిన ఇరిగేషన్ అధికారులు.

....పెద్దవాగు ప్రాజెక్ట్ తాత్కాలిక మరమ్మత్తులు కోసం నిధులు మంజూరు చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన మంత్రి తుమ్మల ,నిధులు మంజూరు చేయిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.

....అతి భారీ వర్షం వరదల తో పెద్దవాగు ప్రాజెక్ట్ ఆనకట్ట కు గండ్లు పడగా అర టీఎంసీ నీరు ఖాళీ అయింది.ఈ సీజన్ లోనే ప్రాజెక్ట్ ఆయకట్టు కింద పంటలు సాగు కోసం తాత్కాలిక మరమ్మత్తులు  చేపట్టి సాగునీరు ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి తుమ్మల స్పష్టం చేసారు.నిధులు మంజూరు చేయించే భాధ్యత నాది రైతులకు సాగు నీటి కష్టాలు రాకుండా చూడాలని కోరారు.

పెద్దవాగు ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులు కోసం సాయం అందించడం లో వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు..

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793