-->

25వ వార్డులోని 5, 6, 7 సెంటర్ ఐసిడిఎస్ అంగన్ వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

25వ వార్డులోని 5, 6, 7 సెంటర్ ఐసిడిఎస్ అంగన్ వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

25వ వార్డులోని 5, 6, 7 సెంటర్ ఐసిడిఎస్ అంగన్ వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

 కొత్తగూడెం మున్సిపాలిటీ 25వ వార్డు గాజులరాజo బస్తి 5, 6, 7 సెంటర్ ఐసిడిఎస్ అంగన్ వాడి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వార్డు కౌన్సిలర్ సాహెర బేగం మాట్లాడుతూ తల్లిపాలు  సురక్షితమైనవని, తల్లిపాలే పిల్లలకు అమృతం లాంటివని బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించడం వల్ల బిడ్డలకు ఇమ్యూనిటీ శక్తి పెరిగి సకలరోగనివారణలా పనిచేస్తాయని చెప్పారు.

కొత్తగూడెం శాసనసభ్యులు కూనాంనేని. సాంబశివరావు  ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అన్ని అంగన్వాడి సెంటర్ లలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని పిల్లలకు బడిబాట, తల్లిపాల వారోత్సవాలు, పిల్లలకు పౌష్టికాహారం, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు ఫ్రీ ఫిడింగ్ లాంటివి చాలా చక్కగా జరుగుతున్నాయని వీటన్నింటిని అర్హులైన వారు ఉపయోగించుకోవాలని చెప్పారు.

ఈ సందర్భంగా వార్డులో తల్లిపాల వారోత్సవాలు జయప్రదం చేయాలని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ సాహెర బేగంతో పాటు అంగన్వడి సూపర్వైజర్ శారద, ఉమెన్స్ చైల్డ్ వెల్ఫేర్ సోషల్ వర్కర్ భారతి, అంగన్వాడి టీచర్స్ పద్మ, శైలజ, రాజకుమారి ఆయాలు పాల్గొన్నారు*

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793