ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు పోరాడి విజయం సాధించారు
*సమ్మె విజయవంతం ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు పోరాడి విజయం సాధించారు*
- *పోరాడి 2 నెలలు వేతనాలు సాధించుకున్న కార్మికులు*
*మరి కొన్ని హామీలు ఆసుపత్రి సూపర్డెంట్ వీర రెడ్డి గారి హామీ మేరకు సమ్మె విరమణ*
- *వారం రోజుల్లో మరో నెల జీతం వేస్తామని హామీ.*
- *కార్మికులకు గుర్తింపు కార్డులు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.*
- పీఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, ఈఎస్ఐ సౌకర్యం ప్రతి కార్మికులు అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.
- కొంతమంది సూపర్వైజర్ల కార్మికుల వేధింపులను ఇతర అన్ని రకాల సమస్యల పైన వారం రోజుల కూర్చుని చర్చించి పరిష్కారం చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది.
- సమ్మె విరమణకు కొన్ని డిమాండ్లతో ఉన్నటువంటి వినతిపత్రాన్ని సూపర్డెంట్ సూచన మేరకు ఆర్ఎం నవీన మేడం కి ఇవ్వడం జరిగింది.
- సూపర్డెంట్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కార్మికులతో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని బండారి శేఖర్ తెలిపారు.

Post a Comment