సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి.
సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి.
మహిళలకు అసెంబ్లీలో ఇచ్చే గౌరవం ఇదేనా..!?
ఏ మొహం పెట్టుకుని వచ్చావని డిప్యూటీ సీఎం భట్టి అనడం అన్యాయం.
మహిళలకు బీఆర్ఎస్ సముచిత స్థానం, గౌరవం కల్పించింది.
తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా రేవంత్ రెడ్డి, భట్టి క్షమాపణ చెప్పాలి.
కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి.
ఎల్ఐసి ఆఫీస్ దగ్గర నల్లబ్యాడ్జీలతో నిరసన.
భారీ సంఖ్యలో హాజరైన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.
కొత్తగూడెం : సీఎం రేవంత్‌రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ప్రజాక్షేత్రంలో తగినమూల్యం చెల్లించుకోక తప్పదని,
తెలంగాణ ఆడబిడ్డల పట్ల ఏ మాత్రం గౌరవం లేదని, అధికారం, అహంకారంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని.. ఆ వ్యాఖ్యలను సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు సూచనల మేరకు కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో ఎల్ఐసి ఆఫీస్ దగ్గర నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ... మహిళలకు పెద్ద పీట వేస్తామని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అసెంబ్లీలో ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.
సీఎం వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక స్థానం, గౌరవం ఉందని, కనీసం ఈ సోయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతవని.
ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ. జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తనస్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను అందరూ ఖండించాలన్నారు. మహిళలకు బీఆర్ఎస్ సముచిత స్థానం, గౌరవం కల్పించిందని, మా మహిళా శాసనసభ్యులపై అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారన్నారు.
ఈ అవమానం కేవలం సబితకు, సునితకు జరిగింది కాదని, తెలంగాణ ఆడబిడ్డలందకీ జరిగిన అవమానమన్నారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయమన్నారు. కావాలనే ముఖ్యమంత్రి ఆడబిడ్డలను అవమానించారని, తెలంగాణ ఆడబిడ్డల ఉసురు ఆయనకు తగులుతుందన్నారు.
తమ ఇద్దరు మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలని, ప్రజల దీవెనలు కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లని, రేవంత్ లాగా పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్ళు కాదని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఏ మొహం పెట్టుకుని వచ్చావని ఉపముఖ్యమంత్రి భట్టి అనడం అన్యాయమన్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్నా ఏరోజైనా ఆడబిడ్డలను అవమానించిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే దాదాపు వెయ్యి లైంగిక దాడి కేసులు నమోదయ్యాయంటే మహిళలకు రక్షణ ఏమాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చని నిలదీశారు. ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రేవంత్, భట్టి క్షమాపణలు చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలోమున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్. చుంచుపల్లి ఎంపీపీ బాదవశాంతి, ఎంపీటీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు కొల్లు పద్మ, కౌన్సిలర్స్ వేముల ప్రసాద్, అంబుల వేణు, కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, బి ఆర్ఎస్ లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఉర్దూగర్ చైర్మన్ అన్వర్ పాషా, ఎండి ఖాజా భక్ష్, షమ్మీ, మైనుద్దీన్, షరీఫ్, జక్కుల సుందర్, పూర్ణ, వినోద్, తోగూర రాజశేఖర్, మాధవిలత, లలితమ్మ, స్రవంతి, రాణి, అపర్ణ, శీను, తాండ్ర శీను, అరుణ్, అశోక్, దూడల కిరణ్, ఇక్బాల్ పాల్వంచ పట్టణ అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.
Post a Comment