-->

ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు: సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు: సీఎం రేవంత్ రెడ్డి

 ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు: సీఎం రేవంత్ రెడ్డి

 హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. 

గత ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందన్న రేవంత్ రెడ్డి.. ఎస్సీ వర్గీకరణపై తమ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించిందని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని.. అందు కోసం అవసరమైతే ఆర్డినె న్స్,తీసుకొస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి. 

ప్రస్తుతం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ అమలుచేస్తామని హామీ ఇచ్చారు.సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని స్వాగతి  స్తున్నామన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. 

సీఎం రేవంత్ ఆరుగురు ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి అడ్వకేట్‌ను నియమించి.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు. తీర్పు సమన్యాయం, సమ ధర్మం అని.. అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే పోరాటం జరిగిందన్నారు. 

ఈ విషయం తమ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అభినందిస్తున్నామన్నారు. ఈ తీర్పు ఒక వర్గానికి వ్యతిరేకం కాదన్నారు...

Blogger ఆధారితం.