-->

తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు కొనసాగించాలి

తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు కొనసాగించాలి

 తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు కొనసాగించాలి.

 కూర బాలకృష్ణ చారిటబుల్ సర్వీసెస్ ఫౌండర్ ప్రెసిడెంట్ కూర శ్రీధర్ 

  ఒక్కరోజు ఉపవాసం చెయ్యాలంటనే చాలా కష్టం అలాంటిది 56 రోజులు అమరా నిరాహార దీక్ష చేసి అమరులు అయినా పొట్టి శ్రీరాములు గారి పేరు మార్పు చేయడం చాలా బాధాకరం

భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ముఖ్యంగా తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం గావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు.

పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో, రాష్ట్రానికో చెందిన వ్యక్తి కాదు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడు. ఆ మహనీయుడి జ్ఞాపకార్ధం మన తెలుగు విశ్వవిద్యాలయానికి వారి పేరు పెట్టుకుని భావితరాలకు వారి త్యాగాన్ని తెలియజేస్తూ, వారిని సముచిత రీతిలో గౌరవించుకుంటున్నాము.

కాని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు గారి పేరుకు బదులుగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలని భావించడం ఎంతమాత్రము సరికాదు. సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణకు అందించిన సేవలు చిరస్మరణీయం. అందులో ఎంతమాత్రము సందేహం లేదు. కాని ప్రతాప్ రెడ్డి గారిని గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాములు గారి పేరును తొలగించడం భావ్యం కాదు.

సురవరం ప్రతాప్ రెడ్డి గారి జ్ఞాపకార్ధం ఏదేని కొత్త ప్రాజెక్ట్ కు వారి పేరు పెట్టి సముచిత రీతిలో గౌరవించాలని, ప్రజాపరిపాలన తో తెలంగాణా రాష్ట్ర ప్రజల గుండెల్లోకి దూసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరునే కొనసాగాలని, అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని భావితరాలకు తెలియజెప్పే విధంగా తెలుగు విశ్వవిద్యాలయానికి వారి పేరే ఉంచాలని కూర బాలకృష్ణ చారిటబుల్ సర్వీసెస్ తరపున ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాము.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793