-->

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద

 శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద

540 అడుగులకు చేరిన నీటిమట్టం - నేడు విడుదల  - హైదరాబాద్‌ బ్యూరో : కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గతేడాది ఈ సమయంలో వెలవెలబోయిన ప్రాజెక్టులు ఈ సంవత్సరం వర్షాకాల ఆరంభంలోనే గరిష్ట స్థాయి నీటిమట్టాలకు చేరుకున్నాయి.

తెలుగు రాష్ట్రాల రైతాంగానికి ప్రధాన సాగునీరు వనరైన నాగార్జున సాగర్‌లోకి గత నాలుగు రోజుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న జూరాల, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులు నిండటంతో వరదనీటిని దిగువకు వదులుతున్నారు. 

జూరాల నుంచి మూడు లక్షలు, తుంగభద్ర నుంచి రెండు లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంలోకి కొనసాగుతోంది. వరద ప్రవాహాన్ని అంచనావేసిన అధికారులు గురువారం శ్రీశైలం నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్‌లోకి వదులుతున్నారు.

నాగార్జున సాగర్‌ గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 185 టిఎంసిల నిల్వతో 540 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. శుక్రవారం సాయంత్రం నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులు నిర్ణయించారు. 

ఈ నేపథ్యంలో ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సాగర్‌ నుంచి నీటి విడుదలతో ప్రస్తుతం డెడ్‌ స్టోరేజ్‌ ఉన్న పులిచింతల జలకళ సంతరించుకోనుంది.

Blogger ఆధారితం.